ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత టీవీ దేశ్ముఖ్ కన్నుమూత | RSS leader T V Deshmukh passes away | Sakshi
Sakshi News home page

ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత టీవీ దేశ్ముఖ్ కన్నుమూత

Oct 24 2014 8:05 PM | Updated on Sep 2 2017 3:19 PM

ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకుడు టీవీ దేశ్ముఖ్ (68) మరణించారు.

ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకుడు టీవీ దేశ్ముఖ్ (68) మరణించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు ఆయన క్షేత్ర సంఘచాలక్గా వ్యవహరించారు. గత రెండేళ్లుగా ప్రొస్టేట్ కేన్సర్తో బాధపడుతున్నట్లు ఆర్ఎస్ఎస్ ఓ ప్రకటనలో తెలిపింది.

సికింద్రాబాద్లో ఆయన అంత్యక్రియలు జరిగాయి. అంతకుముందు నగరంలోని ఆయన ఇంట్లో సంతాప సభ నిర్వహించారు. ఆ సభకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు చెందిన పలువురు నాయకులు హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement