breaking news
tv deshmukh
-
ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత టీవీ దేశ్‌ముఖ్ కన్నుమూత
ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకుడు టీవీ దేశ్‌ముఖ్ (68) మరణించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు ఆయన క్షేత్ర సంఘచాలక్‌గా వ్యవహరించారు. గత రెండేళ్లుగా ప్రొస్టేట్ కేన్సర్‌తో బాధపడుతున్నట్లు ఆర్ఎస్ఎస్ ఓ ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్‌లో ఆయన అంత్యక్రియలు జరిగాయి. అంతకుముందు నగరంలోని ఆయన ఇంట్లో సంతాప సభ నిర్వహించారు. ఆ సభకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు చెందిన పలువురు నాయకులు హాజరయ్యారు. -
ఆర్ఎస్ఎస్ నేత టీవీ దేశ్‌ముఖ్ మృతి
హైదరాబాద్: ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత సంఘ్ చాలక్ టీవీ దేశ్‌ముఖ్ గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా కేన్సర్ బాధపడుతున్న ఆయన దీపావళి రోజున తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు క్షేత్ర సంచాలకులుగా ఆయన పనిచేశారు. టీవీ దేశ్‌ముఖ్ భౌతిక కాయానికి శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన అంత్యక్రియలకు ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రముఖులు హాజరయ్యే అవకాశముంది. దేశ్‌ముఖ్ మరణం పట్ల బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ సంతాపం ప్రకటించారు.