రూ. 100 కోట్లతో ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్ స్కీమ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు.
హైదరాబాద్: రూ. 100 కోట్లతో ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్ స్కీమ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించే బీసీ విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించేందుకు ఈ స్కాలర్‌షిప్ స్కీమ్ ఉపయోగపడుతుందని తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో బీసీ సంక్షేమంపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.
అదేవిధంగా కొత్తగా బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ప్రభుత్వ పథకాల ద్వారా బీసీల్లో అన్ని కులాల వారు లబ్ధి పొందేలా కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.