రూ.10 లక్షల విలువైన నకిలీ కారం పట్టివేత | rs.10 lakh worth fake mirchi powder caught in lb nagar | Sakshi
Sakshi News home page

రూ.10 లక్షల విలువైన నకిలీ కారం పట్టివేత

Jul 7 2017 4:02 PM | Updated on Sep 5 2017 3:28 PM

ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా నకిలీ కారం తయారు చేస్తున్న గోదాం పై ఎస్ఓటి పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.

హైదరాబాద్‌: ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా నకిలీ కారం తయారు చేస్తున్న గోదాం పై ఎస్ఓటి పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. బూజు పట్టిన మిరపకాయలతో కారం తయారు చేస్తూ, చెక్క పౌడర్, అయిల్ కలిపి కారం తయారు చేస్తున్నారని సమాచారం రవడంతో ఎస్ఓటి పోలీసులు సోదాలు నిర్వహించారు. పట్టుబడిన కారం విలువ రూ.10లక్షల విలువ ఉంటుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
 

Advertisement
 
Advertisement
Advertisement