రామాంతపూర్‌లో భారీ చోరీ | robbery in ramanthapur | Sakshi
Sakshi News home page

రామాంతపూర్‌లో భారీ చోరీ

Oct 7 2016 4:37 PM | Updated on Aug 30 2018 5:27 PM

తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి రూ.4 లక్షల నగదుతో పాటు 40 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు.

హైదరాబాద్: తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి రూ.4 లక్షల నగదుతో పాటు 40 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన నగరంలోని రామాంతపూర్‌లో శుక్రవారం వెలుగు చూసింది. స్థానికంగా నివాసముంటున్న ఓ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి దసరా సెలవులకు స్వగ్రామానికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు తాళం పగల గొట్టి ఇంట్లో ఉన్నకాడికి దోచుకెళ్లారు. ఇది గుర్తించిన చుట్టుపక్కల వాళ్లు ఇంటి యజమానికి, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement