నైజీరియన్ గదిలో భారీగా నగదు చోరీ | Robbery in nigerian student room in hyderabad city | Sakshi
Sakshi News home page

నైజీరియన్ గదిలో భారీగా నగదు చోరీ

Apr 6 2016 7:52 PM | Updated on Oct 17 2018 5:27 PM

ఫిలింనగర్ హకీంపేట సమీపంలోని పారామౌంట్ కాలనీలో నివసించే నైజీరియన్ విద్యార్థి గదిలో భారీ మొత్తంలో నగదు చోరీకి గురైంది.

హైదరాబాద్ : ఫిలింనగర్ హకీంపేట సమీపంలోని పారామౌంట్ కాలనీలో నివసించే నైజీరియన్ విద్యార్థి గదిలో భారీ మొత్తంలో నగదు చోరీకి గురైంది. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నైజీరియాకు చెందిన ఓ విద్యార్థి జేఎన్‌టీయూలో చదువుతూ పారామౌంట్ కాలనీలో స్నేహితులతో కలిసి అద్దెకుంటున్నాడు.

దంత చికిత్స కోసం రెండు రోజుల క్రితమే రూ.3.50 లక్షలు డ్రా చేసి తన గదిలోఉంచాడు. బుధవారం ఉదయం ఆస్పత్రికి వెళ్లే క్రమంలో నగదు కోసం చూడగా కనిపించలేదు. వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయని నగదు చోరీ అయిందని గుర్తించి... బంజారాహిల్స్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో... కేసు నమోదు చేసి... పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement