హైదర్‌నగర్ ఎస్‌బీఐలో చోరీ యత్నం | robbery attempt in hyder nagar SBI bank | Sakshi
Sakshi News home page

హైదర్‌నగర్ ఎస్‌బీఐలో చోరీ యత్నం

Sep 13 2017 12:28 PM | Updated on Aug 30 2018 5:24 PM

కూకట్‌పల్లిలోని హైదర్‌నగర్ ఎస్‌బీఐ బ్యాంక్ చోరీకి దొంగలు యత్నించారు.

హైదరాబాద్ : కూకట్‌పల్లిలోని హైదర్‌నగర్ ఎస్‌బీఐ బ్యాంక్ చోరీకి దొంగలు యత్నించారు. బ్యాంకు తాళాలు పగులగొట్టి  మంగళవారం రాత్రి లోపలికి వెళ్లినట్లు ఆనవాళ్లు కనిపించాయి. లాకర్లు తెరుచుకోకపోవడంతో దొంగలు వెనక్కి వెళ్లినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం బ్యాంకు వద్దకు వచ్చిన సిబ్బంది బ్యాంకు గేట్లు తెరిచి ఉండడం చూసి షాకయ్యారు. తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. బ్యాంకు వద్దకు చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement