'ఆనాడు ఇలానే జరిగితే వైఎస్ఆర్ పోరాడారు' | Raghuveera reddy takes on chandrababu | Sakshi
Sakshi News home page

'ఆనాడు ఇలానే జరిగితే వైఎస్ఆర్ పోరాడారు'

Feb 26 2016 2:13 PM | Updated on Jul 28 2018 3:23 PM

'ఆనాడు ఇలానే జరిగితే వైఎస్ఆర్ పోరాడారు' - Sakshi

'ఆనాడు ఇలానే జరిగితే వైఎస్ఆర్ పోరాడారు'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుపై పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి శుక్రవారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుపై పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి శుక్రవారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని రఘువీరారెడ్డి ఆరోపించారు. విభజన చట్టంలోని హామీలను కూడా బడ్జెట్లో ప్రస్తావించలేదన్నారు. కేంద్రంపై ఒత్తిడి చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు.

గతంలో రాష్ట్రానికి ఇలానే అన్యాయం జరిగితే మాజీ కేంద్రమంత్రి లాలూలో దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పోరాడారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ తర్వాత కేంద్రం రాష్ట్రానికి న్యాయం చేసిందన్నారు. తక్షణం ఢిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని చంద్రబాబుకు రఘువీరారెడ్డి సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement