అంబర్‌పేట పరిధిలో కార్డన్ సర్చ్ | police karden and search at hyderabad amberpet area | Sakshi
Sakshi News home page

అంబర్‌పేట పరిధిలో కార్డన్ సర్చ్

Jan 7 2016 10:30 PM | Updated on Sep 4 2018 5:07 PM

అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న బతుకమ్మకుంటలో గురువారం రాత్రి 7 గంటల సమయంలో పోలీసులు కార్డన్‌సెర్చ్ చేపట్టారు.

హైదరాబాద్: అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న బతుకమ్మకుంటలో గురువారం రాత్రి 7 గంటల సమయంలో పోలీసులు కార్డన్‌సెర్చ్ చేపట్టారు. ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో పోలీస్ సిబ్బందిని మోహరించి ఇల్లిల్లూ సోదా చేశారు.


ఇద్దరు మహిళలు, ఆరుగురు పురుషులను పాత నేరస్థులుగా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 30 ద్విచక్రవాహనాలు, 14 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. మలక్‌పేట ఏసీపీ సీహెచ్ సుధాకర్, అంబర్‌పేట ఇన్‌స్పెక్టర్ రవీందర్‌రెడ్డిలతోపాటు ఈస్ట్‌జోన్ పరిధిలోని పలువురు ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలతో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement