దోపిడీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్ | Police arrested gang robbers in hyderabad | Sakshi
Sakshi News home page

దోపిడీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

Aug 9 2014 10:27 AM | Updated on Aug 30 2018 5:24 PM

హైదరాబాద్‌ నగర శివార్లో ప్రేమికులను బెదిరించి.. అత్యాచారాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

హైదరాబాద్ : హైదరాబాద్‌ నగర శివార్లో ప్రేమికులను బెదిరించి.. అత్యాచారాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడు ఫెయిజల్‌ దయాని ఆధ్వర్యంలో 30మంది యువకులు ఒక ముఠాగా ఏర్పడి దోపిడీలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు.

 

రెండు నెలల క్రితం పహాడీషరీఫ్‌ షాహిన్‌నగర్‌ ప్రాంతంలోని ఓ ఫాంహౌస్‌లోకి చొరబడి దంపతులపై దాడి చేసి బంగారం, నగదు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పక్కాప్లాన్‌లో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణలో ముఠా అకృత్యాలు వెలుగులోకి వచ్చాయన్నారు. ముఠా నాయకుడితోపాటు మిగిలిన సభ్యుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement