సంక్రాంతి ‘కానుక’.. ప్లాట్‌ఫాం టిక్కెట్‌ ధర పెంపు | platform ticket fare hike temporarily | Sakshi
Sakshi News home page

సంక్రాంతి ‘కానుక’.. ప్లాట్‌ఫాం టిక్కెట్‌ ధర పెంపు

Jan 9 2018 4:21 PM | Updated on Mar 22 2019 7:19 PM

సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులు కాని వారిని నియంత్రించేందుకు కాచిగూడ స్టేషన్‌లో తాత్కాలికంగా ప్లాట్‌ఫారం టికెట్‌ ధర పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయించింది. సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని కాచిగూడ స్టేషన్‌లో పెరగనున్న ప్రయాణీకుల రద్దీతోపాటు వారి వెంట వచ్చే ప్రయాణం చేయని జన సంఖ్యను కూడా అధికారులు ముందుగా అంచనా వేశారు. దీంతో ప్రయాణికులు కానివారిని ప్లాట్‌ఫాంలపైకి ప్రవేశించకుండా క్రమబద్ధీకరించేందుకు, ప్రయాణికులకు అసౌకర్యాలు కలగకుండా చూసేందుకు కాచిగూడ స్టేషన్‌లో ప్రస్తుతం రూ.10లుగా ఉన్న ప్లాట్‌ఫారం టికెట్టు ధరను జనవరి 11 నుంచి 17వ తేదీ వరకు రూ.20 లకు పెంచారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించి రైల్వే శాఖతో సహకరించాల్సిందిగా దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఎం.ఉమాశంకర్‌ ఒక ప్రకటనలో కోరారు. 

Advertisement
 
Advertisement
Advertisement