
ఆ నాలుగు గంటలే కీలకం
పేట్ బషీరాబాద్ ఎన్‌సిఎల్ కాలనీలో జరిగిన రూ. 11 లక్షల చోరీపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
► సీసీ కెమెరాల పుటేజీ అధ్యయనం
► మూడు బృందాలుగా దర్యాప్తు..
కుత్బుల్లాపూర్: పేట్ బషీరాబాద్ ఎన్‌సిఎల్ కాలనీలో జరిగిన రూ. 11 లక్షల చోరీపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నెల 17న మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల మధ్య దొంగతనం జగినట్లు గుర్తించిన పోలీసులు ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలపై దృష్టి సారించారు. ఈ నేపధ్యంలో రెండు రోజులుగా ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజీలను సేకరించి ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు.
ఆదివారం అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్లు సమాచారం. ఏసీపీ అందె శ్రీనివాస్‌రావు, సీఐ రంగారెడ్డి, పాత నేరస్తులపై ఆరా తీశారు. సీసీఎస్, ఎస్‌ఓటీ, క్రైం పార్టీ పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.