ప్రజా సంక్షేమమే ప్రధాని మోడీ లక్ష్యం | people's welfare is modi's goal, says kishan reddy | Sakshi
Sakshi News home page

ప్రజా సంక్షేమమే ప్రధాని మోడీ లక్ష్యం

Aug 23 2015 8:16 PM | Updated on Aug 15 2018 6:34 PM

ప్రజా సంక్షేమమే ప్రధాని మోడీ లక్ష్యం - Sakshi

ప్రజా సంక్షేమమే ప్రధాని మోడీ లక్ష్యం

రాజకీయాలకు అతీతంగా టీమ్ ఇండియాగా పనిచేసి దేశాభివృద్ధికి కృషి చేయడమే ప్రధాని నరేంద్రమోడీ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి అన్నారు.

హైదరాబాద్ సిటీ: రాజకీయాలకు అతీతంగా టీమ్ ఇండియాగా పనిచేసి దేశాభివృద్ధికి కృషి చేయడమే ప్రధాని నరేంద్రమోడీ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి అన్నారు. పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన భీమా పథకంలో బ్యాంకు ఖాతాదారుంలదరూ విధిగా చేరి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

బీజేపీ మాజీ కార్పొరేటర్ కన్నె ఉమా రమేష్‌యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం కాచిగూడ నింబోలిఅడ్డలో ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్యాంకు ఖాతాలున్న వారు ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన దరఖాస్తు పూర్తి చేసి ఇవ్వాలని, ఆ బీమాకు అవసరమయ్యే డబ్బులు తానే చెల్లిస్తానని, ప్రజలు ఎవ్వరూ ఒక్క రూపాయి కూడా ఇవ్వవద్దని సూచించారు.

దేశ ప్రధాని నరేంద్రమోదీ ప్రతి ఒక్కరికీ బీమా పథకం వర్తించేలా ఈ పథకాన్ని ప్రవేవపెట్టారని చెప్పారు. సురక్ష బీమా యోజన పథకం ద్వారా ఏడాదికి రూ.12 అతి స్వల్ప ప్రీమియం చెల్లిస్తే రూ.2లక్షల ప్రమాద బీమా పొందవచ్చన్నారు. ప్రమాదం అనేది ఏరకంగా వస్తుందో తెలియదని, ఏదైనా జరగకూడనిది జరిగితే ఆ కుటుంబం మొత్తం రోడ్డునపడుతుందన్నారు.

ప్రజలు దీన్ని దృష్టిలో ఉంచుకుని బ్యాంకు ఖాతాలున్న వారందరూ ఈ పథకంలో చేరాల్సిన అవసరం ఉందని, బ్యాంకు ఖాతాలు లేనివారు వెంటనే జీరో బ్యాలెన్స్ ద్వారా ఖాతాలో ప్రారంభించుకోవాలని సూచించారు. బీమా పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి లబ్ధి చూకూర్చేందుకై బీమా పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement