1500 కిమీ సైకిల్‌పై ప్రయాణించి పవన్‌ను కలిసిన వీరాభిమాని | pawan kalyan meet to his fan | Sakshi
Sakshi News home page

1500 కిమీ సైకిల్‌పై ప్రయాణించి పవన్‌ను కలిసిన వీరాభిమాని

May 1 2015 1:08 AM | Updated on Mar 22 2019 5:33 PM

1500 కిమీ సైకిల్‌పై ప్రయాణించి పవన్‌ను కలిసిన వీరాభిమాని - Sakshi

1500 కిమీ సైకిల్‌పై ప్రయాణించి పవన్‌ను కలిసిన వీరాభిమాని

తన అభిమాన హీరో పవన్ కల్యాణ్ కోసం ఓ వీరాభిమాని సైకిల్‌పై 1,500 కిమీ ప్రయాణం చేసి వచ్చి కలిశాడు.

సిటీబ్యూరో: తన అభిమాన హీరో పవన్ కల్యాణ్ కోసం ఓ వీరాభిమాని సైకిల్‌పై 1,500 కిమీ ప్రయాణం చేసి వచ్చి కలిశాడు. పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌కు చెందిన అద్దంకి రవికి పవన్‌పై ఎనలేని అభిమానం.

రవి ఏప్రిల్ 3న ఖరగ్‌పూర్ నుంచి సైకిల్‌పై బయల్దేరి నెలరోజుల పాటు 1,500 కిలోమీటర్లు ప్రయాణం చేసి గురువారం సాయంత్రం తన అభిమాన హీరో పవన్ కల్యాణ్‌ను ఆయన కార్యాలయంలో కలుసుకున్నాడు. అనంతరం రవి మాట్లాడుతూ చాలా ఏళ్లుగా పవన్‌ను కలవాలన్న తన కోరిక తీరిందని సంబరపడ్డాడు.
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement