ఓ తుపాకీ మిస్ ఫైర్ అయి కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన బేగంపేటలోని ఆక్టోపస్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.
హైదరాబాద్: ఓ తుపాకీ మిస్ ఫైర్ అయి కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన బేగంపేటలోని ఆక్టోపస్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.
టీఎస్ఎస్పీ 13వ బెటాలియన్కు చెందిన శివకుమార్ అనే ఆక్టోపస్ కానిస్టేబుల్ తన వద్ద ఉన్న తుపాకీ శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా మిస్ ఫైరైంది. దీంతో అతను అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి ఉద్యోగులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శివకుమార్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అతని స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల. దీంతో మృతుని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.