‘రైతుల పాలిట శాపంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం’ | Nagam Janardhan Reddy comments on TRS government | Sakshi
Sakshi News home page

‘రైతుల పాలిట శాపంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం’

Apr 8 2016 5:10 AM | Updated on May 25 2018 1:22 PM

‘రైతుల పాలిట శాపంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం’ - Sakshi

‘రైతుల పాలిట శాపంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం’

టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని బచావో తెలంగాణ మిషన్ వ్యవస్థాపకుడు...

సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని బచావో తెలంగాణ మిషన్ వ్యవస్థాపకుడు నాగం జనార్దన్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో గురువారం మాట్లాడుతూ.. కరువు మండలాలను ప్రకటించి నెలలు గడిచినా సీఎం కేసీఆర్, మంత్రులు వాటిని పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. కరువు నివారణకు కేంద్రం రూ. 358 కోట్లు ఇచ్చినా, రైతుల కోసం రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. కేసీఆర్ అనుభవరాహిత్యంతో రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న నష్టంపై జూన్ 1న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement