'డీలర్స్‌ గౌరవ వేతనం పెంచే పరిస్థితి లేదు' | minister etela rajender clarity on ration dealers problems | Sakshi
Sakshi News home page

'డీలర్స్‌ గౌరవ వేతనం పెంచే పరిస్థితి లేదు'

Jun 30 2017 4:18 PM | Updated on Sep 5 2017 2:52 PM

రేషన్‌ డీలర్ల సమస్యలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని, అయితే వారికి గౌరవ వేతనం ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదని మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు.

హైదరాబాద్‌: రేషన్‌ డీలర్ల సమస్యలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని, అయితే వారికి గౌరవ వేతనం ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదని మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. అరెస్టు అయి గోషా మహల్ స్టేడియంలో ఉన్న రేషన్ డీలర్లను కలిసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు షబ్బీర్‌ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డిలు వారి ఆందోళనకు సంఘీబావం తెలిపారు. అక్కడినుంచే మంత్రి ఈటలకు ఫోన్‌ చేసి వారి సమస్యలపై మాట్లాడారు. గౌరవ వేతనం అంశంపై నిర్ణయం పెండింగ్‌లో ఉందని, కొందరు బోగస్ డీలర్లు ఉన్నందున వారిని తొలగించి నిర్ణయం తీసుకుందామని సీఎం చెప్పారని ఈటల సమాధానమిచ్చారు.
 

Advertisement
 
Advertisement
Advertisement