ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితులు, గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున మండిపడ్డారు.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితులు, గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున మండిపడ్డారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదోవ పట్టించారని మేరుగ నాగార్జున ఆరోపించారు.
టీడీపీలోని దళిత మంత్రులందరు కళ్లులేని కబోదుల్లా వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాజ్యాంగబద్ధంగా దళితులు, గిరిజనులకు రావాల్సిన వాటాలను పక్కదారి పట్టించే హక్కు చంద్రబాబుకు ఎక్కడిదని అన్నారు. అమరావతిలో దళితుల భూమి లాక్కుని అంబేద్కర్ విగ్రహం పెడుతున్నారా? అని ప్రశ్నించారు. తప్పుడు జీవోలు, లెక్కలతో దళితులు, గిరిజనులను అన్యాయం చేయొద్దని మేరుగ నాగార్జున సూచించారు.