వివాహిత ఆత్మహత్య | Married woman committed suicide | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Jan 29 2016 6:16 PM | Updated on Nov 6 2018 7:56 PM

రెండురోజుల కిందట ఇంటి నుంచి అదృశ్యమైన వివాహిత కాముని చెరువులో మృతదేహాంగా భయటపడిన సంఘటన ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

రెండురోజుల కిందట ఇంటి నుంచి అదృశ్యమైన వివాహిత కాముని చెరువులో మృతదేహాంగా భయటపడిన సంఘటన ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రంలోని సిద్దేశ్వరకాలనీకి చెందిన పస్తం రమేష్ భార్య సుగుణ (22) కూరగాయలు తీసుకొస్తానంటు ఈ నెల 27 మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి బయలుదేరింది. ఎంతకి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు అన్ని చోట్లా వెతికారు. గురువారం సాయంత్రం ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్లో సుగుణ కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు.


దీంతో పోలీసులు మహిళ అదృశ్యం కింద కేసు కూడా నమోదు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం కాముని చెరువులో మహిళ మృతదేహుం తేలియాడుతుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వారి కుటుంబ సభ్యుల ఆధారంగా మృతదేహం అదృశ్యమైన సుగుణదిగా నిర్ధారించారు.

ఇంట్లో  తరచు చోటు చేసుకుంటున్న కుటంబకలహాల కారణంగానే సగుణ ఆత్మహత్యకు పాల్పడిందని వారి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రమేష్‌తో సుగుణ వివాహం పదినెలల కిందటే జరిగిందని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement