కాప్రాలో ఉద్రిక్తత | man suicide attempt due to Demolition of buildings in kapra | Sakshi
Sakshi News home page

కాప్రాలో ఉద్రిక్తత

Jan 12 2017 1:05 PM | Updated on Aug 29 2018 8:38 PM

కాప్రాలో అక్రమాల కట్టడాల కూల్చివేతల సందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

హైదరాబాద్‌: పట్టా చేసుకున్న భూమిని ప్రభుత్వ భూమి అంటూ అక్కడ నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చివేస్తుండటంతో.. మనస్తాపానికి గురైన బాధితుడు వంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకొవడానికి యత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సంఘటన మేడ్చల్‌ లోని కాప్రా వద్ద గురువారం వెలుగుచూసింది. గత పాతికేళ్లుగా పట్టా ఉన్న 6 ఎకరాల భూమిని ఈ రోజు ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకోవడానికి వచ్చారు. దీనికి పట్టాదారుడు అడ్డుకున్నాడు. అయినా పై నుంచి ఆదేశాలు ఉన్నాయని అధికారులు అక్కడ ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. దీంతో మనస్తాపానికి గురైన బాధితుడు వంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement