లేటేస్ట్ | latest | Sakshi
Sakshi News home page

లేటేస్ట్

Jan 20 2015 11:58 PM | Updated on Sep 2 2017 7:59 PM

లేటేస్ట్

లేటేస్ట్

విభిన్నమైన వంటకాలను వడ్డించడమే కాదు... సరికొత్త థీమ్‌లను అలంకరించుకుని ఆకట్టుకుంటున్నాయి నగరంలోని రెస్టారెంట్లు.

విభిన్నమైన వంటకాలను వడ్డించడమే కాదు... సరికొత్త థీమ్‌లను అలంకరించుకుని ఆకట్టుకుంటున్నాయి నగరంలోని రెస్టారెంట్లు. తాజాగా మాదాపూర్ మైండ్‌స్పేస్‌లోని ‘ది వెస్టర్న్ హైదరాబాద్ కంగన్ రెస్టారెంట్’ ఇలాంటి వెరైటీ ఆలోచనతోనే అతిథుల ఆదరాభిమానాలు అందుకుంటోంది. ముంబై, పుణె తదితర ప్రాంతాల వెజ్, నాన్‌వెజ్ రుచులను ఆహార ప్రియుల కోసం ఇక్కడ వేడివేడిగా వడ్డిస్తోంది.

మంగళవారం ఏర్పాటు చేసిన ‘కిచెన్స్ ఆఫ్ కంగన్’లో సబ్జీ నూరాని శోర్బ, రాజ్మా దమ్ బిర్యానీ, పాన్ కుల్ఫీ విత్ గుల్‌కంద్ కవియార్, దాల్ కంగన్, టిక్కోని మిర్చి, తందూరీ నల్లి, ముర్గ్ గిల్లూరి టూక్, ముర్గ్ బారిస్తా పులావ్, నీంబూ ఔర్ తుల్సి కా ఫిష్ టిక్కా, గులాబీ పట్టి కా ఖీర్ వంటివెన్నో వంటకాలు ఘుమఘుమలాడుతున్నాయి.

రోజూ రాత్రి ఏడు గంటల నుంచి ఈ టేస్ట్స్ అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఇక ఈ రెస్టారెంట్‌ను గాజులతో అద్భుతంగా అలంకరించారు. మహిళలనే కాదు... మగవారినీ ఈ థీమ్ ఆకట్టుకుంటోంది. ‘కంగన్’ అని పేరు పెట్టుకున్న మా రెస్టారెంట్‌కు వచ్చినవారందరికీ జ్ఞాపకంగా ఒక గాజు ఇస్తున్నాం అని నిర్వాహకులు చెప్పారు.        
సాక్షి, సిటీ ప్లస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement