లాల్ దర్వాజా బాంబు కేసు కొట్టివేత | lal darwaja tiffin bomb case | Sakshi
Sakshi News home page

లాల్ దర్వాజా బాంబు కేసు కొట్టివేత

Oct 26 2015 11:42 AM | Updated on Oct 19 2018 7:52 PM

ఏళ్ల తరబడి కొనసాగిన లాల్ దర్వాజా కాకతీయ హోటల్ టిఫిన్ బాంబు కేసును కొట్టి వేశారు.

హైదరాబాద్: ఏళ్ల తరబడి కొనసాగిన లాల్ దర్వాజా కాకతీయ హోటల్ టిఫిన్ బాంబు కేసును కొట్టి వేశారు. ఈ కేసును 16 ఏళ్లుగా విచారణ చేపడుతున్న నాంపల్లి కోర్టు చివరకు సోమవారం కొట్టివేసింది. సాక్ష్యాలు లేకపోవడంతోనే కేసును కొట్టి వేసినట్లు ఈ సందర్భంగా కోర్టు స్పష్టం చేసింది.

1999లో హైదరాబాద్లోని లాల్ దర్వాజాలో చోటు చేసుకున్న టిఫిన్ బాంబు కేసును 16 ఏళ్లుగా నాంపల్లి కోర్టు విచారిస్తున్న విషయం తెలిసిందే. దీంతోపాటు 2000లో జరిగిన మత ఘర్షణ, అల్లర్ల కేసును కూడా నాంపల్లి ప్రత్యేక కోర్టు కొట్టి వేసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement