breaking news
tiffin bomb
-
లారీలో పేలిన టిఫిన్ బాక్స్ బాంబు
మదురై: తమిళనాడులో మదురై సమీపంలో వైగై నది దగ్గర ఆపినవున్న లారీలో టిఫిన్ బాక్స్ బాంబు పేలింది. టిఫిన్ బాక్సులో పేలుడు పదార్థాలు ఉంచినట్టు గుర్తించారు. శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కాగా బాంబు శక్తిమంతమైనది కాకపోవడంతో ఎవరూ గాయపడలేదు. లారీ మాత్రం పాక్షికంగా దెబ్బతిన్నది. స్టేషనరీ సామాన్లు తీసుకెళ్తున్న ఈ లారీని నది దగ్గర ఎందుకు పార్క్ చేశారు? ఎవరిని లక్ష్యంగా చేసుకున్నారు? అన్న విషయాలు తెలియరాలేదు. కొందరు గుర్తు తెలియని దుండగులు టిఫిన్ బాక్సు బాంబును లారీలో విసిరివేసి ఉంటారని లేదా లారీలో అమర్చిఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మదురై, పరిసర ప్రాంతాల్లో గత పదేళ్లలో పోలీసులు పది టిఫిన్ బాక్స్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. -
లాల్ దర్వాజా బాంబు కేసు కొట్టివేత
-
లాల్ దర్వాజా బాంబు కేసు కొట్టివేత
హైదరాబాద్: ఏళ్ల తరబడి కొనసాగిన లాల్ దర్వాజా కాకతీయ హోటల్ టిఫిన్ బాంబు కేసును కొట్టి వేశారు. ఈ కేసును 16 ఏళ్లుగా విచారణ చేపడుతున్న నాంపల్లి కోర్టు చివరకు సోమవారం కొట్టివేసింది. సాక్ష్యాలు లేకపోవడంతోనే కేసును కొట్టి వేసినట్లు ఈ సందర్భంగా కోర్టు స్పష్టం చేసింది. 1999లో హైదరాబాద్లోని లాల్ దర్వాజాలో చోటు చేసుకున్న టిఫిన్ బాంబు కేసును 16 ఏళ్లుగా నాంపల్లి కోర్టు విచారిస్తున్న విషయం తెలిసిందే. దీంతోపాటు 2000లో జరిగిన మత ఘర్షణ, అల్లర్ల కేసును కూడా నాంపల్లి ప్రత్యేక కోర్టు కొట్టి వేసింది.