తెలంగాణ అసెంబ్లీలో రేపు (సోమవారం) కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో రేపు (సోమవారం) కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. అసెంబ్లీ సమావేశాల్లో ఆ రోజు ఉదయం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అమెన్‌మెంట్ బిల్లు, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ అమెన్‌మెంట్ బిల్లులను ప్రవేశపెట్టనుంది.
అలాగే సాయంత్రం 4 గంటలకు గ్రేటర్ హైదరాబాద్ అమెన్‌మెంట్ బిల్లు, తెలంగాణ మున్సిపాలిటీల అమెన్‌మెంట్ బిల్లు, తెలంగాణ వ్యాట్ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడైంది.