నవ వధువు అదృశ్యం | karimnagar New bride missing in hyderabad | Sakshi
Sakshi News home page

నవ వధువు అదృశ్యం

Mar 7 2016 6:49 PM | Updated on Sep 4 2018 5:07 PM

భర్తతో కలిసి నగరానికి వచ్చిన ఓ నవ వధువు కనిపించకుండాపోయింది. కరీంనగర్ జిల్లాకు చెందిన వేముల క్రాంతి కిరణ్‌కు మంచిర్యాలకు చెందిన జ్యోతితో గత నెలలో వివాహమైంది.

మారేడుపల్లి: భర్తతో కలిసి నగరానికి వచ్చిన ఓ నవ వధువు కనిపించకుండాపోయింది. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌కు చెందిన వేముల క్రాంతి కిరణ్‌కు ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన జ్యోతితో గత నెలలో వివాహమైంది.

క్రాంతి కిరణ్ సికింద్రాబాద్లో ఉండే తన సోదరి ఇంటికి వెళ్లేందుకు భార్యతో కలిసి ఆదివారం జూబ్లీ బస్టాండ్కు చేరుకున్నాడు. బస్టాండ్‌కు వచ్చాక జ్యోతి వాష్ రూంకు వెళ్తానని చెప్పి తిరిగిరాలేదు. దీంతో భర్త, బంధువులు చుట్టుపక్కల వారిని వాకబు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో భర్త క్రాంతికిరణ్ మారేడుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement