పోలీసు పదోన్నతులకు ఉమ్మడి డీపీసీ | joint dpc for both states of police | Sakshi
Sakshi News home page

పోలీసు పదోన్నతులకు ఉమ్మడి డీపీసీ

Jul 11 2014 1:14 AM | Updated on Sep 2 2018 5:20 PM

పదోన్నతుల వివాదం కేసుకు సంబంధించి దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్ విచారణ నేపథ్యంలో సోమవారం సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని చవిచూసిన ఇరు రాష్ట్రాల పోలీసు అధికారులు నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు

సాక్షి, హైదరాబాద్: పదోన్నతుల వివాదం కేసుకు సంబంధించి దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్ విచారణ నేపథ్యంలో సోమవారం సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని చవిచూసిన ఇరు రాష్ట్రా ల పోలీసు అధికారులు నష్ట నివారణ చర్యలు ప్రారంభిం చారు న్యాయస్థానం నిర్దేశించిన వారం గడువులోపే పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు.

అయితే రాష్ట్ర విభజనలో భాగమైన రాష్ట్ర స్థాయి పోస్టుల కేటాయిం పు పూర్తికాకపోవడంతో డీఎస్పీ, ఆపై స్థాయి అధికారుల పదోన్నతుల కోసం ఉమ్మడి శాఖాపరమైన పదోన్నతుల కమిటీ (డీపీసీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇన్‌స్పెక్టర్ వరకు జోనల్ పోస్టుగా పరిగణిస్తారు. విభజన తర్వాత ఈ జోన్లు ఎక్కడివి అక్కడే ఉండటంతో వీరికి కేటాయింపు ఉండదు. ఈ హోదాల్లో ఉన్న అధికారులకు పదోన్నతులు డీజీపీ చేపడతారు.
 
దీని ప్రకారం ఏపీకి  చెందిన 55 మంది ఇన్‌స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ తాత్కాలిక డీజీపీ జేవీ రాముడు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే సమస్యకు పరిష్కారంగా తొలిసారి ఉమ్మ డి డీపీసీ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఏపీ, తెలంగాణ హోం శాఖ ముఖ్య కార్యదర్శులు, సేవల విభాగం కార్యదర్శులు, డీజీపీలు సభ్యులుగా ఉంటారు. డీపీసీకి అనుమతి కోరుతూ పోలీసు శాఖ ప్రభుత్వాలకు లేఖ రాసింది. అనుమ తి లభిస్తే.. సర్వీసు రికార్డుల్లో పేర్కొన్న జన్మస్థలం ఆధారంగా స్థానికతను నిర్ధారిస్తూ అక్కడున్న పోస్టుల ఆధారంగా పదోన్నతులు ఇచ్చి, కేటాయింపులు చేయనున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement