సాక్షి జర్నలిస్టుకు సాహిత్య అకాడమీ ఆహ్వానం | Invited a journalist to witness the Sahitya Akademi | Sakshi
Sakshi News home page

సాక్షి జర్నలిస్టుకు సాహిత్య అకాడమీ ఆహ్వానం

Feb 8 2017 2:46 AM | Updated on Aug 20 2018 8:20 PM

సాక్షి జర్నలిస్టు, కథా రచయిత పూడూరి రాజిరెడ్డికి సాహిత్య అకాడమీ ఆహ్వానం అందింది.

హైదరాబాద్‌: సాక్షి జర్నలిస్టు, కథా రచయిత పూడూరి రాజిరెడ్డికి సాహిత్య అకాడమీ ఆహ్వానం అందింది. ఈ నెల 21–26 వరకు ఢిల్లీలో అకాడమీ నిర్వహించనున్న ‘ఫెస్టివల్‌ ఆఫ్‌ లెటర్స్‌’ ఉత్సవంలో భాగంగా.. 23న జరిగే ‘యువ సాహితి: ద న్యూ హార్వెస్ట్‌’ కార్యక్రమంలో 24 భాషల నుంచి నలబై ఏళ్లలోపు కథకులు తమ కథల్ని వినిపి స్తారు. ఇందులో తెలుగు తరఫున రాజిరెడ్డికి సాహిత్య అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు ఆహ్వానం పంపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement