తెలంగాణ మెడికల్ ఎంసెట్ కేసు దర్యాప్తు వేగవంతం | investigation fast on telangana medical eamcet paper leak case | Sakshi
Sakshi News home page

తెలంగాణ మెడికల్ ఎంసెట్ కేసు దర్యాప్తు వేగవంతం

Jul 27 2016 10:54 AM | Updated on Sep 17 2018 6:26 PM

తెలంగాణ మెడికల్ ఎంసెట్ కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు.

హైదరాబాద్ : తెలంగాణ మెడికల్ ఎంసెట్ కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. అందులోభాగంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కనిగిరిలో వి ఖాసిం అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడి పోలీస్ స్టేషన్కు తరలించి... విచారిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు రెండు రోజులుగా కనిగిరిలో దర్యాప్తు చేపట్టారు.

పేపరు లీక్ చేసిన నిందితులతో ఖాసిం తరచుగా మాట్లాడినట్లు అధికారులు ఈ సందర్భంగా గుర్తించారు. అయితే తమకు ఎలాంటి సమాచారం లేదని స్థానిక పోలీసులు వెల్లడించారు. కాగా ఖాసీం స్థానికంగా పండ్లు, వడ్డీ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. హైదరాబాద్లో అతడి బంధువులు ఉన్నత స్థాయిలో ఉన్నారని పోలీసులు విచారణలో గుర్తించినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement