breaking news
telangana medical EAMCET
-
తెలంగాణ మెడికల్ ఎంసెట్ కేసు దర్యాప్తు వేగవంతం
హైదరాబాద్ : తెలంగాణ మెడికల్ ఎంసెట్ కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. అందులోభాగంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కనిగిరిలో వి ఖాసిం అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడి పోలీస్ స్టేషన్కు తరలించి... విచారిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు రెండు రోజులుగా కనిగిరిలో దర్యాప్తు చేపట్టారు. పేపరు లీక్ చేసిన నిందితులతో ఖాసిం తరచుగా మాట్లాడినట్లు అధికారులు ఈ సందర్భంగా గుర్తించారు. అయితే తమకు ఎలాంటి సమాచారం లేదని స్థానిక పోలీసులు వెల్లడించారు. కాగా ఖాసీం స్థానికంగా పండ్లు, వడ్డీ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. హైదరాబాద్లో అతడి బంధువులు ఉన్నత స్థాయిలో ఉన్నారని పోలీసులు విచారణలో గుర్తించినట్లు సమాచారం. -
జులై 9న తెలంగాణ మెడికల్ ప్రవేశ పరీక్ష
హైదరాబాద్ : నీట్' పై కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చిన నేపథ్యంలో ఎంసెట్ -2 (2016) పరీక్ష నిర్వహించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఎంసెట్-2 షెడ్యూల్ను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. దీంతో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు మరో పరీక్ష నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖమంత్రి లక్ష్మారెడ్డి బుధవారం సెక్రటేరియట్లోని తన చాంబర్లో ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, కాళోజి హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్. కరుణాకర్ రెడ్డి, ఎంసెట్ కన్వీనర్ రమణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 28న ఎంసెట్-2కు నోటిఫికేషన్ వెలువడనుంది. జులై 9న తెలంగాణ మెడికల్ ప్రవేశ పరీక్ష నిర్వహించి, 14న ఫలితాలను విడుదల చేయనున్నారు. వచ్చేనెల 1వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లికేషన్ల స్వీకరణకు జూన్ 7 చివరి తేదీ. *ఈ నెల 28న ఎంసెట్-2 నోటిఫికేషన్ *వచ్చే నెల 1వ తేదీ నుంచి ఆన్ లైన్ అప్లికేషన్ల స్వేకరణ *అప్లికేషన్ల స్వీకరణకు ఆఖరు తేదీ 07-06-2016 *రూ. 500/- ఫైన్ తో 14-06-2016 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు *రూ. 1000/- ఫైన్ తో 21-06-2016 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు *రూ. 5000/- ఫైన్ తో 28-06-2016 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు *రూ. 10000/- ఫైన్ తో 06-07-2016 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు *02-07-2016 నుంచి 07-07-2016 వరకు హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకునే అవకాశం * జూలై 9న తెలంగాణ స్టేట్ ఎంసెట్-2 (2016) పరీక్ష *ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు *జూలై 9న ప్రిలిమినరీ కీ విడుదల *12వ తేదీ లోగా ప్రిలిమినరీ కీ ఫై అభ్యంతరాలు తెలుపుకోవచ్చు *14న ర్యాంకుల ప్రకటన *రిజిస్ట్రేషన్ ఫీజుల వివరాలు: ఎస్సీ, ఎస్టీలకు రూ.250/,ఇతరులకు రూ. 500/-