ఆ టీచర్ను చూస్తే భయమేసి స్కూల్ కి వెళ్లలేదు | Iam scared of my teacher, says don basco school student | Sakshi
Sakshi News home page

ఆ టీచర్ను చూస్తే భయమేసి స్కూల్ కి వెళ్లలేదు

Jul 16 2014 12:33 PM | Updated on Nov 9 2018 4:19 PM

ఆ టీచర్ను చూస్తే భయమేస్తోంది...అందుకే ఈరోజు స్కూల్ కు వెళ్లలేదు. ముందు స్కేల్ పెట్టి కొట్టింది....

హైదరాబాద్ : 'ఆ టీచర్ను చూస్తే భయమేస్తోంది...అందుకే ఈరోజు స్కూల్ కు వెళ్లలేదు. ముందు స్కేల్ పెట్టి కొట్టింది. అది విరిగి పోవటంతో మళ్లీ పెన్ను పెట్టి గీరింది' అని తెలుగు మాట్లాడినందుకు డాన్ బాస్కో స్కూల్ ఉపాధ్యాయురాలి చేతిలో దెబ్బలు తిన్న ఓ విద్యార్థి మాటలు.

పాఠశాలలో తెలుగు మాట్లాడిన పాపానికి ఎర్రగడ్డ డాన్‌బాస్కో స్కూల్‌లో ఉపాధ్యాయురాలు తనూజ స్కేల్తో విద్యార్థులను చితకబాదిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు బుధవారం విచారణ జరుపుతున్నారు. విద్యాశాఖ అధికారులు ఈరోజు ఉదయం డాన్ బాస్కో స్కూల్కు వెళ్లి విచారిస్తున్నారు. మరోవైపు విద్యార్థి సంఘాలు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సంఘటనపై ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.

మరోవైపు ఈ సంఘటనను బాలల హక్కుల సంఘం తీవ్రంగా ఖండించింది. తెలుగువారు తెలుగుమాట్లాడం జన్మహక్కని, ఉపాధ్యాయురాలి తీరును ఖండిస్తున్నామని బాలల సంఘం అధ్యక్షురాలు అనురాధారావు  తెలిపారు. ఈ సంఘటనపై రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సుమోటోగా కేసు విచారణను చేపట్టింది. జూలై 21వ తేదీలోగా సంఘటనపై పూర్తి నివేదిక అందించాలని అధికారులతో పాటు పాఠశాల యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement