breaking news
don bosco school
-
పావుగంటలో పట్టుకొచ్చారు.. థాంక్యూ సార్
లఖీంపూర్ ఖేరీ(యూపీ): గతంతో పోలిస్తే నేడు ఆన్లైన్ బుకింగ్ వంటి సౌకర్యాలకారణంగా వంటగ్యాస్ సిలిండర్‌ను కేవలం 15 నిమిషా ల్లోనే ఇంటి వద్ద డెలివరీ తీసుకోగలిగానని ప్రధాని మోదీకి ఒక గృహిణి తన అమితానందాన్ని ఒక లేఖ ద్వారా వ్యక్తంచేశారు. ఈ వివరాలను శనివారం ప్రధాని మోదీ స్వయంగా అందరితో పంచుకున్నారు. దీంతో గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఘటన తాలూకు వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఉత్తర ప్రదే శ్‌లోని లఖీంపూర్ పట్టణానికి చెందిన అరుణశ్రీ డాన్ బాస్కో స్కూల్లో ఉపాధ్యాయురాలు. గత ఏడాది డిసెంబర్లో ఎల్పీజీ సిలిండర్‌ను బుక్ చేయగా కేవలం 15 నిమిషాల్లో డెలివరీ బాయ్ సిలిండర్‌ను ఇంటి వద్దకు పట్టుకొచ్చాడు. ఆశ్చర్యపోయిన ఆమె ప్రధానికి లేఖ రాశారు. ‘‘ ఆనందం, ఉద్వేగంతో ప్రధానికి లేఖ రాశా. జీవితాలను ఇంత సులభతరంగా మార్చినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపా. నా చిన్నతనంలో ఎల్పీజీ కనెక్షన్ తీసుకోవాలన్నా, సిలిండర్ మార్చుకోవాలన్నా ఎంతో ప్రయాసతో కూడిన వ్యవహారం. ఆకాలం పోయి ఒక్క ఫోన్‌కాల్‌తో సిలిండర్ ఇంటి వద్దే ప్రత్యక్షమవుతోంది. ఈ ఘనత ప్రధాని మోదీ, ఆయన ప్రభుత్వానిదే’’ అని ఆమె అన్నారు. లేఖపై మోదీ స్పందించారు. మహిళా సాధికారత కోసం తామెన్నో కేంద్ర పథకాలను అమలుచేస్తున్నామని మోదీ గుర్తుచేశారు. -
డాన్‌బాస్కో స్కూల్ ఎదుట ఆందోళన
హైదరాబాద్: స్కూల్ ఫీజులు పెంచడానికి నిరసనగా విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. నగరంలోని ఎర్రగడ్డ మోతీనగర్ డాన్‌బాస్కో స్కూల్లో విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆగ్రహించిన తల్లిదండ్రులు శనివారం ధర్నా చేశారు. అడ్మిషన్లు తీసుకునే సమయంలో తక్కువ ఫీజులు చెప్పి ఇప్పుడు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారని, పాఠశాల యాజమాన్యం పై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడుతున్నారు. -
ఆ టీచర్‌ను చూస్తే భయమేసి స్కూల్ కి వెళ్లలేదు
హైదరాబాద్ : 'ఆ టీచర్‌ను చూస్తే భయమేస్తోంది...అందుకే ఈరోజు స్కూల్ కు వెళ్లలేదు. ముందు స్కేల్ పెట్టి కొట్టింది. అది విరిగి పోవటంతో మళ్లీ పెన్ను పెట్టి గీరింది' అని తెలుగు మాట్లాడినందుకు డాన్ బాస్కో స్కూల్ ఉపాధ్యాయురాలి చేతిలో దెబ్బలు తిన్న ఓ విద్యార్థి మాటలు. పాఠశాలలో తెలుగు మాట్లాడిన పాపానికి ఎర్రగడ్డ డాన్‌బాస్కో స్కూల్లో ఉపాధ్యాయురాలు తనూజ స్కేల్‌తో విద్యార్థులను చితకబాదిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు బుధవారం విచారణ జరుపుతున్నారు. విద్యాశాఖ అధికారులు ఈరోజు ఉదయం డాన్ బాస్కో స్కూల్‌కు వెళ్లి విచారిస్తున్నారు. మరోవైపు విద్యార్థి సంఘాలు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సంఘటనపై ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. మరోవైపు ఈ సంఘటనను బాలల హక్కుల సంఘం తీవ్రంగా ఖండించింది. తెలుగువారు తెలుగుమాట్లాడం జన్మహక్కని, ఉపాధ్యాయురాలి తీరును ఖండిస్తున్నామని బాలల సంఘం అధ్యక్షురాలు అనురాధారావు తెలిపారు. ఈ సంఘటనపై రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సుమోటోగా కేసు విచారణను చేపట్టింది. జూలై 21వ తేదీలోగా సంఘటనపై పూర్తి నివేదిక అందించాలని అధికారులతో పాటు పాఠశాల యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. -
క్లాసులో విద్యార్థులు తెలుగు మాట్లాడారని ...
పాఠశాల తరగతి గదిలో విద్యార్థులు తెలుగు మాట్లాడటమే నేరమైంది. తరగతి గదిలో తెలుగు మాట్లాడతారా అంటూ విద్యార్థులకు టీచర్ పెద్ద క్లాస్ తీసుకుంది. తెలుగు మాట్లాడితే తప్పేముంది అని సదరు విద్యార్థులు టీచర్‌ను ప్రశ్నించారు. అంతే టీచర్‌కు కోపం కట్టలు తెంచుకుంది. దాదాపు 40 మంది విద్యార్థులను చితకబాది పారేసింది. ఆ సంఘటన మంగళవారం హైదరాబాద్ సనత్‌నగర్ లోని డాన్ బాస్కో స్కూల్లో చోటు చేసుకుంది. ఆ ఘటనపై సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలకు చేరుకున్నారు. సదరు టీచర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.


