డాన్‌బాస్కో స్కూల్ ఎదుట ఆందోళన | Parents held a protest in front of Don Bosco school for high fees | Sakshi
Sakshi News home page

డాన్‌బాస్కో స్కూల్ ఎదుట ఆందోళన

Jul 23 2016 2:53 PM | Updated on Sep 15 2018 5:39 PM

స్కూల్‌ ఫీజులు పెంచడానికి నిరసనగా విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.

హైదరాబాద్: స్కూల్‌ ఫీజులు పెంచడానికి నిరసనగా విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. నగరంలోని ఎర్రగడ్డ మోతీనగర్ డాన్‌బాస్కో స్కూల్లో విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆగ్రహించిన తల్లిదండ్రులు శనివారం ధర్నా చేశారు. అడ్మిషన్లు తీసుకునే సమయంలో తక్కువ ఫీజులు చెప్పి ఇప్పుడు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారని, పాఠశాల యాజమాన్యం పై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement