
భారతదేశంలో పెరుగుతున్న ప్రైవేట్ విద్య ఖర్చులు పేద, మధ్య తరగతి ప్రజలతోపాటు అధిక ఆదాయం ఉన్నవారికి కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధాన నగరాల్లో వార్షిక పాఠశాల ఫీజులు ఏటా విపరీతంగా పెరుగుతున్నాయి. విద్యను వ్యాపారంగా చూడకూడదనే నియమాన్ని పక్కనపెట్టి చాలా విద్యాసంస్థల యాజమాన్యాలు యథేచ్ఛగా ఫీజులు పెంచుతున్నాయి. భారీగా సంపాదన ఉన్న కొద్దిమందికే నాణ్యమైన విద్య పరిమితం అవుతోందా అనే ప్రశ్నలను లేవనెత్తుతుంది. దీనికి ఉదాహరణగా బెంగళూరులో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఓ ప్రముఖ అంతర్జాతీయ పాఠశాల ఫీజుల వ్యవహారం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
బెంగళూరులోని అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తున్నట్లు చెబుతున్న ఓ పాఠశాల అధికారిక డాక్యుమెంట్‌లో అన్ని గ్రేడ్లలో విపరీతమైన ఫీజులున్నట్లు వెల్లడైంది. గ్రేడ్ 1లో పిల్లలను చేర్పించే తల్లిదండ్రులు ఏడాదికి రూ.7.35 లక్షలు, 11, 12 తరగతులకు ఏడాదికి రూ.11 లక్షలు ఫీజు చెల్లించాలనేలా ఉన్నట్లు కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. రూ.లక్ష వన్ టైమ్, నాన్ రిఫండబుల్ అడ్మిషన్ ఫీజు కింద చెల్లించాలని స్కూల్ యాజమాన్యం డాక్యుమెంట్లు పేర్కొన్నట్లు చెప్పాయి.
It's a free market. Pricing is upto individuals. It's customer choice to pick what they want. All is right in this theory, like most of the theories.
Look at the fee structure of one of the good schools in Bengaluru. This is unaffordable even for an IT couple earning a combined… pic.twitter.com/1AvDEQRMyz— D.Muthukrishnan (@dmuthuk) August 31, 2025
ఫైనాన్షియల్ ప్లానర్ డి.ముత్తుకృష్ణన్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో షేర్ చేసిన పోస్ట్‌లో ఈమేరకు వివరాలు వెల్లడించారు. మంచి వేతనం ఉన్న ఉద్యోగులు, వ్యాపారులు కూడా ఇలాంటి ఖర్చులను నిర్వహించగలరా అని ప్రశ్నించారు. రూ.50 లక్షల ప్రీ ట్యాక్స్ ఆదాయం ఉన్న ఐటీ దంపతులు కూడా ఈ పాఠశాలలో ఇద్దరు పిల్లల ఫీజులు భరించడం కష్టమని ముత్తుకృష్ణన్ అన్నారు.
నెటిజన్ల కామెంట్స్..
ఈ పోస్ట్‌పై నెటిజన్లు స్పందిస్తున్నారు. విద్యా ఖర్చులు ఎగువ మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక స్థితిగతులను కూడా మార్చేస్తున్నాయని కొందరు తెలిపారు. చాలా మంది దంపతులు పిల్లలను కనడానికి ఎందుకు సంకోచిస్తున్నారో ఇలాంటి ఖర్చుల వల్లే అర్థం అవుతుందని ఒకరు కామెంట్ చేశారు. అయితే ఇంటర్నేషన్ సిలబస్, కేంబ్రిడ్జ్ వంటి అంతర్జాతీయ పాఠ్యాంశాలు, ఆధునిక మౌలిక సదుపాయాల వల్లే ఇలాంటి ఫీజులున్నట్లు కొందరు సమర్థించారు. బెంగళూరుకు చెందిన ఓ న్యాయవాది సామాజిక ధోరణులే ఇంత అధిక ఫీజులకు కారణమని ఆరోపించారు.
ఇదీ చదవండి: తగ్గిన ఎల్‌పీజీ సిలిండర్ ధర.. ఏ ప్రాంతంలో ఎంతంటే..