నగర శివారులో భారీ వర్షం | heavy rain in city outscerts | Sakshi
Sakshi News home page

నగర శివారులో భారీ వర్షం

Jun 11 2015 6:04 PM | Updated on Sep 3 2017 3:35 AM

రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.

రాజేంద్రనగర్ (రంగారెడ్డి జిల్లా): రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో ప్రారంభమైన వర్షం 45 నిమిషాల పాటు ఎడతెరిపి లేకుండా పడింది. మైలార్‌దేవ్‌పల్లి, ఉడంగడ్డ, ఆరాంఘర్, గగన్‌పహాడ్, శివరాంపల్లి, రాజేంద్రనగర్, యూనివర్సిటీ, హిమాయత్‌సాగర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అంతే కాకుండా వాటి చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా తేలికపాటి జల్లులు కురిశాయి. ఈ వేసవి కాలం అనంతరం ఇదే భారీ వర్షం.

Advertisement
 
Advertisement
Advertisement