సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య | head constable suicide in hyderabad | Sakshi
Sakshi News home page

సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

Dec 4 2015 8:09 PM | Updated on Nov 6 2018 7:56 PM

హైదరాబాద్ చాంద్రాయణగుట్ట సీఆర్పీఎఫ్ క్యాంపస్‌లో ఓ హెడ్ కానిస్టేబుల్ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు.

చాంద్రాయణగుట్ట: హైదరాబాద్ చాంద్రాయణగుట్ట సీఆర్పీఎఫ్ క్యాంపస్‌లో ఓ హెడ్ కానిస్టేబుల్ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. క్రిష్ణపల్లి మధు (47) అనే హెడ్ కానిస్టేబుల్ క్యాంపస్‌లోని పార్క్‌లో పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయాడు.

ఇది గుర్తించిన తోటి కానిస్టేబుళ్లు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. భార్యతో విభేదాల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అతడు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మధు భార్య ఖమ్మం జిల్లాలో సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్‌గా పనిచేస్తున్నట్టు తెలిసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement