హజ్ తరహాలో రాష్ట్రంలోని నిరుపేద హిందువులను ఉచితంగా తిరుమల యాత్రకు తీసుకెళ్లేందుకు ఏపీ దేవాదాయ శాఖ కొత్త పథకానికి రూపకల్పన చేస్తోంది.
హజ్ తరహాలో రాష్ట్రంలోని నిరుపేద హిందువులను ఉచితంగా తిరుమల యాత్రకు తీసుకెళ్లేందుకు ఏపీ దేవాదాయ శాఖ కొత్త పథకానికి రూపకల్పన చేస్తోంది. ఏడాదికి జిల్లాకు వెయ్యి మంది చొప్పున గుర్తించి విడతల వారీగా తిరుమల యాత్రకు తీసుకెళ్లతారు. రాష్ట్రం మొత్తంగా ఏడాదికి 13 వేల మందికి ఉచిత తిరుమల యాత్రకు అవకాశం దక్కుతుంది.
లబ్దిదారుడి సొంత ప్రాంతం నుంచి తిరుమలకు వెళ్లే మార్గమధ్యంలో మరో రెండు ప్రముఖ దేవాలయాల సందర్శనకు అవకాశం కల్పిస్తారు. ఈ పథకానికి ‘దివ్యదర్శనం’గా నామకరణం చేయాలని ప్రాధమిక ఆలోచన. ప్రస్తుతం అధికారులు లబ్దిదారులు ఎంపిక తీరు తదితర అంశాలపై విధి విధానాల రూపకల్పన చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు త్వరలో వెలువడే అవకాశం ఉందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.