breaking news
divyadarsanam
-
అర గంటలోనే దేవదేవుడి దర్శనం
• ఏటా 1.30 లక్షల మంది సామాన్యులకు ‘దివ్యదర్శనం’ • త్వరలో అమల్లోకి రానున్న కొత్త పథకం సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి దర్శనం సామాన్య భక్తులకు కూడా మరింత సులువుగా లభించనుంది. ఈ మేరకు దేవాదాయ శాఖ త్వరలో దివ్యదర్శనం పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ పథకంలో భక్తుడు క్యూలైన్లోకి వెళ్లిన అరగంటలో దర్శనం పూర్తయ్యేలా టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటారు. ఈ పథకం కింద ఎంపికై తిరుమలకు చేరుకునేవారికి టీటీడీ అధికారులు దగ్గరుండి స్వామి దర్శనం చేయిస్తారు. దర్శనం అనంతరం డిప్యూటీ ఈవో స్థాయి అధికారి చేతులు మీదుగా ఉచితంగా దేవుడి ప్రసాదం అందజేస్తారు. వీఐపీలకు మాత్రమే దక్కే సౌకర్యాలను దివ్యదర్శనం పథకం కింద సామాన్య భక్తులకు లభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక, నిధుల సమీకరణ, భక్తులకు రాయితీతో కూడిన రవాణా సౌకర్యం తదితర అంశాలపై దేవాదాయ శాఖ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.దీని వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఏటా 1.30లక్షల మందికి స్వామివారి దివ్య దర్శనం ఉచితంగా లభించనుంది. -
జిల్లా నుంచి ‘దివ్యదర్శనం’ రూట్ల ఖరారు
కడప కల్చరల్ : తిరుమల–తిరుపతి దేవస్థానాలు, రాష్ట్ర దేవాదాయశాఖ, ధర్మపరిరక్షణ ట్రస్టుతో కలిసి త్వరలో నిర్వహించనున్న దివ్యదర్శనం యాత్రలకు జిల్లా నుంచి రూట్లు ఖరారు అయ్యాయి. జిల్లా దేవాదాయశాఖ అధికారులు పలు కసరత్తుల అనంతరం ప్రణాళికలు రూపొందించి రాష్ట్ర కమిషనర్‌కు అందజేశారు. తుది పరిశీలన అనంతరం వాటినే ఖరారు చేసినట్లు సమాచారం. ఆ వివరాలిలా ఉన్నాయి.∙ తిరుమల–తిరుపతి దేవస్థానాల యాజమాన్యం రాష్ట్ర దేవాదాయశాఖతో కలిసి ప్రతి సంవత్సరం జిల్లాకు చెందిన పది వేల మందికి రాష్ట్రంలోని ఐదు సుప్రసిద్ధ ఆలయాలకు ఉచితంగా యాత్రను నిర్వహించనుంది. బస్సులు, నాలుగు రోజులపాటు వసతి, మూడు పూటల భోజనం అన్నీ నిర్వాహకులే భరించనున్నారు. ఈ మేరకు జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ రాష్ట్ర అధికారులకు జిల్లా యాత్రల రూట్‌మ్యాప్‌ను పంపారు. అధికారులు వాటిని అంగీకరించినట్లు తెలుస్తోంది. మొదటి రూట్æ(రాయచోటి నుంచి).. జిల్లా నుంచి దివ్య దర్శనం యాత్రలకు రెండు రూట్లను ఖరారు చేశారు. యాత్ర ప్రారంభమయ్యాక సోమవారం రాయచోటి వీరభద్రస్వామి ఆలయంలో ఉదయం 7 గంటల్లోపు స్వామిని దర్శించుకుంటారు. అల్పాహారం అనంతరం కాణిపాకం ఆలయానికి ప్రత్యేక బస్సు బయలుదేరనుంది. కాణిపాకం చేరుకుని 10.30 గంటల్లోగా దర్శనం ముగించుకుని మధ్యాహ్నం 1.00 గంటకు శ్రీకాళహస్తి ఆలయానికి చేరుతుంది. మధ్యాహ్న భోజన అనంతరం 3 గంటల్లోగా స్వామిని దర్శించుకుని రాత్రి విజయవాడకు చేరనున్నారు. రాత్రి అక్కడే గడిపి మంగళవారం ఉదయం 7.00 గంటల్లోగా కృష్ణానదిలో స్నానమాచరించి అమ్మవారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 1.00 గంటకు అన్నవరంలోని శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామిని దర్శించుకుంటారు. భోజనం అనంతరం రాత్రి 8.30 గంటలకు ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకుంటారు. రాత్రి అక్కడే బసచేసి బుధవారం ఉదయం 7.00 గంటల్లోగా స్వామిని దర్శించుకుని అల్పాహారం స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు గుంటూరు పెదకాకానిలోని శ్రీ మల్లేశ్వరస్వామిని దర్శించుకుని మధ్యాహ్నం అక్కడే భోజనం చేస్తారు. అక్కడి నుంచి దారిలో మంగళగిరిలోని శ్రీ లక్ష్మి నరసింహాస్వామిని దర్శించుకుని రాత్రి తిరుపతికి చేరనున్నారు. రాత్రి అక్కడే గడిపి గురువారం ఉదయం 10.00 గంటల్లోగా తిరుమలేశుని దర్శనం కల్పిస్తారు. మధ్యాహ్న భోజనంతరం తిరిగి రాయచోటి శ్రీ వీరభద్రస్వామి ఆలయానికి చేరుకోనున్నారు. రెండవ రూట్ (దేవునికడప నుంచి).. రెండవ రూట్లో కూడా సోమవారం నాడే యాత్ర ప్రారంభం కానుంది. దేవుని కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామిని ఉదయం 7.00 గంటల్లోగా దర్శించుకుని అల్పాహారం అనంతరం మధ్యాహ్నం శ్రీశైలం ఆలయానికి చేరి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తారు. స్వామి దర్శనం అనంతరం రాత్రి విజయవాడ శ్రీ కనకదుర్గాదేవి ఆలయానికి చేరనున్నారు. మంగళవారం ఉదయం బయలుదేరి మధ్యాహ్నం అన్నవరంలోని శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి ఆలయానికి చేరనున్నారు. దర్శనం అనంతరం మధ్యాహ్న భోజనం స్వీకరించి రాత్రి ద్వారకా తిరుమలకు చేరుకుంటారు. బుధవారం ఉదయం స్వామి దర్శనం అనంతరం మధ్యాహ్నం గుంటూరు పెదకాకానిలోని శ్రీ మల్లేశ్వరస్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్న భోజనం అనంతరం అదే దారిలో ఉన్న మంగళగిరి శ్రీ లక్ష్మి నరసింహాస్వామిని దర్శించుకుంటారు. రాత్రి శ్రీకాళహస్తికి చేరుకుంటారు. గురువారం ఉదయం స్వామిని దర్శించుకుని 10.00 గంటలకు తిరుమలకు చేరనున్నారు. మధ్యాహ్నం స్వామిని దర్శించుకుని సాయంత్రం కడపకు చేరనున్నారు. -
పేదలకు ఉచిత తిరుమల యాత్ర
హజ్ తరహాలో రాష్ట్రంలోని నిరుపేద హిందువులను ఉచితంగా తిరుమల యాత్రకు తీసుకెళ్లేందుకు ఏపీ దేవాదాయ శాఖ కొత్త పథకానికి రూపకల్పన చేస్తోంది. ఏడాదికి జిల్లాకు వెయ్యి మంది చొప్పున గుర్తించి విడతల వారీగా తిరుమల యాత్రకు తీసుకెళ్లతారు. రాష్ట్రం మొత్తంగా ఏడాదికి 13 వేల మందికి ఉచిత తిరుమల యాత్రకు అవకాశం దక్కుతుంది. లబ్దిదారుడి సొంత ప్రాంతం నుంచి తిరుమలకు వెళ్లే మార్గమధ్యంలో మరో రెండు ప్రముఖ దేవాలయాల సందర్శనకు అవకాశం కల్పిస్తారు. ఈ పథకానికి ‘దివ్యదర్శనం’గా నామకరణం చేయాలని ప్రాధమిక ఆలోచన. ప్రస్తుతం అధికారులు లబ్దిదారులు ఎంపిక తీరు తదితర అంశాలపై విధి విధానాల రూపకల్పన చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు త్వరలో వెలువడే అవకాశం ఉందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.