రాజధాని అమరావతి డెవలప్‌మెంట్ భాగస్వామిగా సింగపూర్ కంపెనీలను స్విస్ ఛాలెంజ్ విధానంలో ఎం పిక చేసే అంశానికి సంబంధించి చట్టంలో పేర్కొన్న నిబంధనలను పాటించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ సూచించారు.
నిర్ణయాన్ని కేబినెట్‌కు వదిలేస్తూ సీఎస్ ప్రత్యేక నోట్
సాక్షి, హైదరాబాద్: రాజధాని అమరావతి డెవలప్‌మెంట్ భాగస్వామిగా సింగపూర్ కంపెనీలను స్విస్ ఛాలెంజ్ విధానంలో ఎం పిక చేసే అంశానికి సంబంధించి చట్టంలో పేర్కొన్న నిబంధనలను పాటించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ సూచించారు. మంగళవారం సీఆర్‌డీఏ అధికారులతో సమావేశానంతరం ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక నోట్ సమర్పించారు. సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు అసెండాస్, సెమ్బ్‌బ్రిడ్జి, సెమ్‌కార్ప్ కన్సార్టియం సమర్పించిన స్విస్ ఛాలెంజ్ ప్రతిపాదనల్లో అత్యంత కీలకమైన సబ్సిడీ అండ్ డెవలప్‌మెంట్ అగ్రిమెంట్‌కు, షేర్ హోల్డింగ్ అగ్రిమెంట్‌కు ముందుగానే సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపిన సంగతి తెల్సిందే.
ఆర్థికమంత్రి యనమల నేతృత్వంలోని మంత్రుల కమిటీ సింగపూర్ కంపెనీల కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలకు ఆమోదించగా ఆ సిఫార్సులను ఆమోదిస్తూ సీఎం కూడా సంతకం చేశారు. అనంతరం సీఎస్ అధ్యక్షతన గల మౌలిక సదుపాయాల అభివృద్ధి అధారిటీకి పంపించారు. అయితే సంబంధిత శాఖకు ఫైలు సర్క్యులేట్ చేయకుండా ఆయా శాఖల అభిప్రాయాలు లేకుండా అథారిటీకి పంపించి వెంటనే కేబినెట్‌కు పెట్టాలంటే ఎలాగని సీఎస్ శుక్రవారం నాటి సమావేశంలో ప్రశ్నించిన విషయం తెలిసిం దే. 24న జరిగే మంత్రివర్గ సమావేశానికి స్విస్ ఛాలెంజ్ ప్రతిపాదనలు వెళ్లనున్నాయి. ఇప్పటికే సీఎం ఆమోదించినందున కేబినెట్ ఆమోదం లాంఛనమే కానుంది. కేబినెట్ ఆమోదం అనంతరం సింగపూర్ కంపెనీల ప్రతిపాదనలను బహిరంగ పరుస్తూ ఛాలెంజ్ చేయడానికి అవకాశం కల్పిస్తారు.