భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం | explosive material seized in rajendranagar | Sakshi
Sakshi News home page

భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

May 12 2016 2:02 PM | Updated on Sep 3 2017 11:57 PM

రాజేంద్రనగర్ శివరాంపల్లిలో పోలీసులు పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను గురువారం స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్ : రాజేంద్రనగర్ శివరాంపల్లిలో పోలీసులు పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను గురువారం స్వాధీనం చేసుకున్నారు. పిల్లర్ నంబర్-294 సమీపంలో ఇంటి నిర్మాణం కోసం ఎలాంటి అనుమతులు లేకుండా పేలుళ్లు జరుపుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్‌వోటీ పోలీసులు దాడి చేసి, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పేలుడుకు వాడే జిలెటిన్ స్టిక్స్ భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement