జీవ వనరుల కేంద్రాల స్థాపనపై శిక్షణ | Training on establishment of biological resource centers April 21 to 23 | Sakshi
Sakshi News home page

జీవ వనరుల కేంద్రాల స్థాపనపై శిక్షణ

Apr 14 2026 3:58 AM | Updated on Apr 14 2026 3:58 AM

Training on establishment of biological resource centers April 21 to 23

రసాయన ఎరువుల వాడ­కాన్ని తగ్గించటానికి.. తెగుళ్ల నియంత్రణ, నేల/మొక్కల ఆరో­గ్య నిర్వహణ కోసం రసాయ­నేతర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించటానికి హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని జాతీయ మొ­క్కల ఆరోగ్య యాజమాన్య సంస్థ (ఎన్‌ఐపీహెచ్‌ఎం) వివిధ తక్కువ ఖర్చుతో కూడిన సాంకేతికతలు, ఉత్పాదకాలను అభివృద్ధి చేసింది. కేంద్ర వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఈ సంస్థ ఏర్పాటైంది. 

దేశంలో సేంద్రియ / ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించటంలో భాగంగా రైతులకు నాణ్యమైన జీవన ఎరువులు, ద్రావణాలు, కషాయాలు వంటి జీవ ఉత్పాదకాలను అందించే జీవ వనరుల కేంద్రాల (బీఆర్‌సీల) స్థాపనపై సంపూర్ణ అవగాహన కలిగించటానికి ఎన్‌ఐపీహెచ్‌ఎం ఈ నెల 21 నుంచి 23 వరకు మూడు రోజుల రెసిడెన్షియల్‌ శిక్షణ ఇవ్వనుంది. 

తక్కువ ఖర్చుతో కూడిన జీవ ఉత్పాదకాలు, వాటి ఉత్పత్తి సాంకేతికతల గురించి అవగాహన కలిగిస్తారు. ప్రగతిశీల రైతులు, ఎఫ్‌పీఓలు / స్వయం సహాయక బృందాలు/ కృషి సఖిలు, విస్తరణ అధికారులు, సేంద్రియ/ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న గ్రామీణ యువ పారిశ్రామికవేత్తలు ఈ శిక్షణ పొందడానికి అర్హులు. ఫీజు, భోజన, వసతి సదుపాయాల వివరాల కోసం ఎన్‌ఐపీహెచ్‌ఎం వెబ్‌సైట్‌ చూడొచ్చు లేదా ఈమెయిల్‌ ద్వారా సంప్రదించవచ్చు: 
dirphmniphm-ap@nic.in - damodar.kammari@gov.in
 

Advertisement
 
Advertisement
Advertisement