అంతా ఏకపక్షమే! | Everything is one-sided | Sakshi
Sakshi News home page

అంతా ఏకపక్షమే!

Jan 19 2017 2:40 AM | Updated on Mar 18 2019 9:02 PM

అసెంబ్లీ శీతాకాల సమావేశాలు పూర్తిగా ఏకపక్షంగా జరిగాయి. అధికార టీఆర్‌ఎస్‌ పక్కా ప్రణాళికతో

అసెంబ్లీ సమావేశాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించిన అధికారపక్షం

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ శీతాకాల సమావేశాలు పూర్తిగా ఏకపక్షంగా జరిగాయి. అధికార టీఆర్‌ఎస్‌ పక్కా ప్రణాళికతో వ్యవహరించి తా ముకోరుకున్నట్లు శాసనసభ, శాసన మండలి లను నడిపింది. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ లో అధికారం చేపట్టి రెండున్నరేళ్లు పూర్తయిన నేపథ్యంలో.. తమ ప్రభుత్వ ప్రోగ్రెస్‌ రిపోర్టును అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించాలన్న ఎజెండాను పూర్తిగా అమలు చేసింది. ఇందుకో సం రోజుకో అంశంపై స్వల్పకాలిక చర్చ జరిపింది. 18 రోజుల సమావేశాల్లో 15 అంశాలపై చర్చించడం గమనార్హం. బీఏసీ సమావేశంలో ప్రతిపక్షాలు డిమాండ్‌ చేసిన అంశాలను ముందుగానే చర్చకు పెట్టి వాటిని ఆత్మరక్షణలో పడేసింది.

దీటుగా ఎదురుదాడి
పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి విస్తృతంగా ప్రచారం చేసుకోవడంలో భాగంగా స్వల్పకాలిక చర్చకు అంశాలను సిద్ధం చేసుకు న్న అధికార పక్షం... విపక్షాలు కోరిన అంశా లనూ చర్చకు పెట్టింది. నోట్ల రద్దు వ్యవహారం రాష్ట్ర పరిధిలోది కాకపోయినా.. విపక్షాల డిమాండ్‌ మేరకు తొలిరోజే చర్చకు తీసుకుంది. నయీమ్‌ అంశాన్ని చర్చకు తీసుకోవడంలోనూ పట్టువిడుపులతో వ్యవహరించింది. భూ సేకరణ, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అంశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని విపక్షాలు ప్రయత్నించినా, ఎదురు దాడితో వాటి దూకుడును నిలువరించింది. ఇందిరమ్మ ఇళ్ల రుణాలను (రూ.3,600కోట్లు) ఏకమొత్తంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించి విపక్షాలను ఆత్మరక్షణలోకి నెట్టింది. ఇక పోడియంలోకి వెళితే సస్పెండ్‌ చేస్తామన్న కఠిన నిర్ణయంతో వచ్చిన అధికార పక్షం... సమావేశాల తొలిరోజే కాంగ్రెస్, టీడీపీ సభ్యులపై ఒక రోజు వేటు వేసింది.

పలు విధాన నిర్ణయాలతో..
సమావేశాలు అధికార, విపక్షాల మధ్య వాదోపవాదాలు, దూషణలకోసం కాదని.. సభ జరిగితే తమకు ఏదో మేలు జరుగుతుం దన్న భరోసా ప్రజలకు కలగాలని టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశంలో వివరించిన కేసీఆర్‌ అదే స్థాయిలో కసరత్తు చేశారు. సభలో కొన్ని విధాన నిర్ణయాలు ప్రకటించారు. సింగరే ణి డిపెండెంట్‌ ఉద్యోగాలు, బీసీ రెసిడెన్షియల్‌ స్కూళ్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, గృహ నిర్మాణ రుణాల రద్దు, చేపలు, గొర్రెల పెంప కం, సైనిక సంక్షేమం, ఒంటరి మహిళలకు రూ.వెయ్యి పెన్షన్, ముస్లిం రిజర్వేషన్‌ అంశాల ను ప్రకటించారు. సమావేశాల్లో ప్రభుత్వం తరఫున కేసీఆర్‌ అన్నీ తానే అయ్యారు. సభ్యుల చర్చ తర్వాత సమాధానా లు ఇచ్చే బాధ్యత తనపైనే వేసుకున్నారు. పదిహేను అంశాలపై స్వల్ప కాలిక చర్చ జరిగితే.. పది అంశాలపై ముఖ్యమంత్రే సమాధానాలు ఇవ్వడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement