తెలంగాణ విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ సమ్మెకు సన్నద్ధమవుతోంది.
విద్యుత్ జేఏసీ నోటీసు అందజేత.. 3న ‘చలో విద్యుత్ సౌధ’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ సమ్మెకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కోలకు నోటీసు ఇచ్చింది. 2014 పీఆర్‌సీని వెంటనే వర్తింపజేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులకు మధ్యంతర భృతి మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ కన్వీనర్ ఏ.సుధాకర్‌రావు సారధ్యంలో వివిధ సంఘాల ప్రతినిధులు గురువారం సాయంత్రం టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ డి.ప్రభాకరరావును కలిసి సమ్మె నోటీసు అందించారు. సమ్మెలో భాగంగా డిసెంబరు 3 న ‘చలో విద్యుత్ సౌధ’ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని, అదేరోజున భవిష్యత్తు కార్యాచరణను వెల్లడిస్తామని తెలిపారు.