6 మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్(ఎంసీహెచ్)కు మొత్తం 6 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి.
6 మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్(ఎంసీహెచ్)కు 5 సార్లు, జీహెచ్‌ఎంసీ ఏర్పాటయ్యాక ఒకసారి కలిపి మొత్తం 6 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి.
హైదరాబాద్ కార్పొరేషన్, సికింద్రాబాద్ కార్పొరేషన్‌లు విలీనమై ఎంసీహెచ్‌గా అవతరించినప్పటి నుంచి ఎంసీహెచ్ అంతరించే వరకు ఐదు సార్లు, జీహెచ్‌ఎంసీ ఏర్పాటయ్యాక ఒక పర్యాయం వెరసి ఇప్పటి వరకు మొత్తం ఆరు పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. 1960 నుంచి నాలుగేళ్లకోమారు 1968 వరకు ఎన్నికలు జరగ్గా, 1968 తర్వాత పద్దెనిమిదేళ్ల వరకు (1986) జరగలేదు. 1986 నుంచి 2002 వరకు 16 సంవత్సరాలు ప్రజలు తమ ప్రజాప్రతినిధులను ఎన్నుకోలేదు.