తప్పతాగి పోలీసు డ్రస్‌లో హంగామా.. | Drunken Man misbehaved with people in secunderabad | Sakshi
Sakshi News home page

తప్పతాగి పోలీసు డ్రస్‌లో హంగామా..

Jan 10 2015 10:39 AM | Updated on Aug 21 2018 7:17 PM

సికింద్రాబాద్‌లో మద్యం మత్తులో ఓ వ్యక్తి హంగామా చేశాడు. పోలీస్‌ డ్రెస్‌లో ఉన్న వ్యక్తి ఫుల్‌గా మందు కొట్టి నడిరోడ్డుపై వీరంగం చేశాడు.

హైదరాబాద్ :  సికింద్రాబాద్‌లో మద్యం మత్తులో ఓ వ్యక్తి హంగామా చేశాడు. పోలీస్‌ డ్రెస్‌లో ఉన్న వ్యక్తి ఫుల్‌గా మందు కొట్టి నడిరోడ్డుపై వీరంగం చేశాడు. రోడ్డుపై వచ్చివెళ్లే వాహనాలను అడ్డుకుని... లైసెన్స్‌ చూపించాలంటూ గడబిడ చేశాడు. అంతేకాకుండా  ఫైర్‌ సిబ్బందితోనూ గొడవకు దిగాడు. ఆటోవాలాల వద్ద అడ్డగోలుగా డబ్బులు వసూలు చేశాడు.  కాగా  పోలీస్‌ డ్రస్సులో ఉన్న ఆ వ్యక్తి ఎవరనేది తెలియలేదు.

తమ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన వ్యక్తి కాదని సికింద్రాబాద్‌ ఫైర్‌స్టేషన్‌ సిబ్బంది తెలిపారు. అయితే ఈ వ్యక్తి ఎవరనేది తేలాల్సి ఉంది. దాంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement