పెండ పట్టే వారికి విమర్శించే అర్హత లేదు | DK Aruna fires on Minister JUPALLY Krishnarao | Sakshi
Sakshi News home page

పెండ పట్టే వారికి విమర్శించే అర్హత లేదు

Jun 29 2016 3:39 AM | Updated on Sep 4 2017 3:38 AM

పెండ పట్టే వారికి విమర్శించే అర్హత లేదు

పెండ పట్టే వారికి విమర్శించే అర్హత లేదు

పెండ పట్టేవారికి, పెండ తినేవారికి తనను విమర్శించే నైతిక అర్హత లేదని ఎమ్మెల్యే డీకే అరుణ మంత్రి జూపల్లినుద్దేశించి ధ్వజమెత్తారు...

మంత్రి జూపల్లిపై డీకే అరుణ ధ్వజం
గద్వాల: పెండ పట్టేవారికి, పెండ తినేవారికి తనను విమర్శించే నైతిక అర్హత లేదని ఎమ్మెల్యే డీకే అరుణ మంత్రి జూపల్లినుద్దేశించి ధ్వజమెత్తారు. తనపై మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలోని తన నివాసంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘నాకు మెదడు ఉంది కాబట్టే.. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి దశకు వచ్చాయి.

మంత్రి జూపల్లికి మెదడులో పెండ ఉంది కాబట్టే.. పూర్తయ్యే ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదు’ అంటూ ఆమె ఫైర్ అయ్యారు. మంచిగా మాట్లాడితే మంచిగా సమాధానాలు వస్తాయనే విషయాన్ని మంత్రి జూపల్లి గుర్తించుకోవాలని సూచించారు. ప్రాజెక్టుల పేరుతో అడ్డమైన గడ్డి తిని మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వారి కమీషన్ల కక్కుర్తి వల్లే జిల్లా కేంద్రంలో అమరవీరుల స్థూపం కూడా విరిగిపోయిందని ఆరోపించారు. వారి నీతి ఏమిటో ఇందులోనే అర్థమవుతుందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement