మీ విధులు ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వొద్దు  | CJI Surya Kant Warns New Advocates-on-Record Against Outsourcing Legal Work | Sakshi
Sakshi News home page

మీ విధులు ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వొద్దు 

Apr 18 2026 4:29 AM | Updated on Apr 18 2026 4:29 AM

CJI Surya Kant Warns New Advocates-on-Record Against Outsourcing Legal Work

న్యాయపరమైన విధులను వ్యక్తిగతంగా నిర్వర్తించుకోవాలి  

అడ్వొకేట్స్‌–ఆన్‌–రికార్డ్‌కు సీజేఐ సూర్యకాంత్‌ సూచన  

న్యూఢిల్లీ: న్యాయవాద వృత్తిలో ఉన్నవారు కొన్ని నైతిక బాధ్యతలకు కట్టుబడి ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ చెప్పారు. కొత్తగా అర్హత సాధించిన అడ్వొకేట్స్‌–ఆన్‌–రికార్డ్‌(ఏఓఆర్‌) బృందం అప్రమత్తంగా వ్యవహరించాలని, న్యాయపరమైన పనులను కృత్రిమ మేధ(ఏఐ) లేదా ఇతర బాహ్య సంస్థలకు ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించవద్దని తేల్చిచెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 145 కింద రూపొందించిన నిబంధనల ప్రకారం.. అడ్వొకేట్స్‌–ఆన్‌–రికార్డ్‌గా నియమించబడిన న్యాయవాదులు మాత్రమే అత్యున్నత న్యాయస్థానంలో ఒక పక్షం తరఫున వాదించగలరు.

 న్యాయవాదులను ఏఓఆర్‌లుగా నియమించే ముందు సుప్రీంకోర్టు వారికి పరీక్ష నిర్వహిస్తుంది. శుక్రవారం ఏఓఆర్‌ల పదవీ స్వీకార కార్యక్రమంలో జస్టిస్‌ సూర్యకాంత్‌ మాట్లాడారు. ఏఓఆర్‌లు కేవలం బార్‌ సభ్యులు మాత్రమే కాదని.. అధికారిక కోర్టు అధికారులు అని గుర్తుచేశారు. ఏఓఆర్‌ల వృత్తి నిబద్ధత, అంకితభావంపైనే న్యాయవ్యవస్థ ప్రతిష్ట ఆధారపడి ఉంటుందన్నారు. వారిపై ఉంచిన విశ్వాసమే వారు తమ ప్రతిష్టను నిర్మించుకోవడానికి పునాదిగా తోడ్పడుతుందన్నారు. న్యాయపరమైన విధులను ఏఓఆర్‌లే వ్యక్తిగతంగా నిర్వర్తించుకోవాలని సూచించారు. కేసుల ఫైలింగ్‌ను ఒక సాధారణ ప్రక్రియగా భావించవద్దని అన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement