breaking news
Ethical eligible
-
మీ విధులు ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వొద్దు
న్యూఢిల్లీ: న్యాయవాద వృత్తిలో ఉన్నవారు కొన్ని నైతిక బాధ్యతలకు కట్టుబడి ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. కొత్తగా అర్హత సాధించిన అడ్వొకేట్స్–ఆన్–రికార్డ్(ఏఓఆర్) బృందం అప్రమత్తంగా వ్యవహరించాలని, న్యాయపరమైన పనులను కృత్రిమ మేధ(ఏఐ) లేదా ఇతర బాహ్య సంస్థలకు ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించవద్దని తేల్చిచెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 145 కింద రూపొందించిన నిబంధనల ప్రకారం.. అడ్వొకేట్స్–ఆన్–రికార్డ్‌గా నియమించబడిన న్యాయవాదులు మాత్రమే అత్యున్నత న్యాయస్థానంలో ఒక పక్షం తరఫున వాదించగలరు. న్యాయవాదులను ఏఓఆర్లుగా నియమించే ముందు సుప్రీంకోర్టు వారికి పరీక్ష నిర్వహిస్తుంది. శుక్రవారం ఏఓఆర్‌ల పదవీ స్వీకార కార్యక్రమంలో జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడారు. ఏఓఆర్లు కేవలం బార్ సభ్యులు మాత్రమే కాదని.. అధికారిక కోర్టు అధికారులు అని గుర్తుచేశారు. ఏఓఆర్‌ల వృత్తి నిబద్ధత, అంకితభావంపైనే న్యాయవ్యవస్థ ప్రతిష్ట ఆధారపడి ఉంటుందన్నారు. వారిపై ఉంచిన విశ్వాసమే వారు తమ ప్రతిష్టను నిర్మించుకోవడానికి పునాదిగా తోడ్పడుతుందన్నారు. న్యాయపరమైన విధులను ఏఓఆర్లే వ్యక్తిగతంగా నిర్వర్తించుకోవాలని సూచించారు. కేసుల ఫైలింగ్‌ను ఒక సాధారణ ప్రక్రియగా భావించవద్దని అన్నారు. -
పెండ పట్టే వారికి విమర్శించే అర్హత లేదు
మంత్రి జూపల్లిపై డీకే అరుణ ధ్వజం గద్వాల: పెండ పట్టేవారికి, పెండ తినేవారికి తనను విమర్శించే నైతిక అర్హత లేదని ఎమ్మెల్యే డీకే అరుణ మంత్రి జూపల్లినుద్దేశించి ధ్వజమెత్తారు. తనపై మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలోని తన నివాసంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘నాకు మెదడు ఉంది కాబట్టే.. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి దశకు వచ్చాయి. మంత్రి జూపల్లికి మెదడులో పెండ ఉంది కాబట్టే.. పూర్తయ్యే ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదు’ అంటూ ఆమె ఫైర్ అయ్యారు. మంచిగా మాట్లాడితే మంచిగా సమాధానాలు వస్తాయనే విషయాన్ని మంత్రి జూపల్లి గుర్తించుకోవాలని సూచించారు. ప్రాజెక్టుల పేరుతో అడ్డమైన గడ్డి తిని మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వారి కమీషన్ల కక్కుర్తి వల్లే జిల్లా కేంద్రంలో అమరవీరుల స్థూపం కూడా విరిగిపోయిందని ఆరోపించారు. వారి నీతి ఏమిటో ఇందులోనే అర్థమవుతుందని పేర్కొన్నారు.


