కాంగ్రెస్ నేతల సెల్‌చల్.. | congress leaders busy with cell phones in meeting | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ నేతల సెల్‌చల్..

Jun 25 2015 2:07 PM | Updated on Mar 18 2019 8:51 PM

సెల్ఫోన్ మానియాకు ఎవరూ అతీతులు కారు. యువతే కాదు.. నేతలు కూడా సెల్ ఫోన్లతో మునిగి తేలుతున్నారు. అది మీటింగ్ అయినా...మరొకటి అయినా సరే..

 సెల్ఫోన్ మానియాకు ఎవరూ అతీతులు కారు. యువతే కాదు.. నేతలు కూడా సెల్ ఫోన్లతో మునిగి తేలుతున్నారు. అది మీటింగ్ అయినా...మరొకటి అయినా సరే.. విషయానికి వస్తే...ఓ పక్క కాంగ్రెస్ పార్టీ సమావేశం.. వేదికపై హేమాహేమీల ప్రసంగాలు నడుస్తున్నాయి. మరోపక్క తమకు పట్టనట్టు కొందరు నేతలు సెల్‌ఫోన్లతో బిజీ అయిపోయారు. ఇదీ బుధవారం జరిగిన మలక్‌పేట నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో చోటు చేసుకున్న సంఘటన.

స్థానిక స్వాతి ఫంక్షన్ హాల్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశానికి పలువురు ముఖ్య నాయకులు హాజరయ్యారు. కార్యకర్తలు ప్రసంగాలు వింటుంటే.. వక్తలు తప్ప, మిగతా నాయకులంతా ప్రసంగం నడుస్తున్నంతసేపూ తమ సెల్‌ఫోన్స్ చూసుకుంటూ కనిపించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలోనూ ఇదే సీన్ కనిపించింది.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement