‘ప్రభుత్వ విభాగాల్లో చంద్రబాబు వేగులు’ | chanrababu informers in telangana government ofiicials | Sakshi
Sakshi News home page

‘ప్రభుత్వ విభాగాల్లో చంద్రబాబు వేగులు’

Oct 15 2016 2:49 AM | Updated on Jul 28 2018 3:33 PM

‘ప్రభుత్వ విభాగాల్లో చంద్రబాబు వేగులు’ - Sakshi

‘ప్రభుత్వ విభాగాల్లో చంద్రబాబు వేగులు’

రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు వేగులున్నారని, వారి ద్వారా ప్రభుత్వ రహస్యాలను తస్కరించి ఏపీలో అమలు చేయడంతో పాటు ప్రభుత్వ సాఫ్ట్‌వేర్‌లను ట్యాంపరింగ్ చేస్తున్నారని...

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు వేగులున్నారని, వారి ద్వారా ప్రభుత్వ రహస్యాలను తస్కరించి ఏపీలో అమలు చేయడంతో పాటు ప్రభుత్వ సాఫ్ట్‌వేర్‌లను ట్యాంపరింగ్ చేస్తున్నారని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. శక్రవారం సీఎస్ రాజీవ్‌శర్మను కలిసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ..

తెలంగాణలో పనిచేస్తున్న 27 మంది అధికారులు సొంత రాష్ట్రంలో పనిచేస్తామని చెప్పడంతో రిలీవ్ చేసినప్పటికీ.. వారిని ఏపీలో విధుల్లో చేర్చుకోకపోవడం శోచనీయమన్నారు. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రాత్రికిరాత్రి డిల్లీ స్థాయిలో ఒత్తిడి పెంచి ఇక్కడికి పంపారన్నారు. కానీ ఇక్కడున్న ఏపీ ఉద్యోగులను మాత్రం వెనక్కి తీసుకోకుండా తమాషా చేస్తున్నారన్నారు. బాబు వైఖరి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement