breaking news
CS rajivsarma
-
‘ప్రభుత్వ విభాగాల్లో చంద్రబాబు వేగులు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు వేగులున్నారని, వారి ద్వారా ప్రభుత్వ రహస్యాలను తస్కరించి ఏపీలో అమలు చేయడంతో పాటు ప్రభుత్వ సాఫ్ట్వేర్లను ట్యాంపరింగ్ చేస్తున్నారని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. శక్రవారం సీఎస్ రాజీవ్‌శర్మను కలిసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో పనిచేస్తున్న 27 మంది అధికారులు సొంత రాష్ట్రంలో పనిచేస్తామని చెప్పడంతో రిలీవ్ చేసినప్పటికీ.. వారిని ఏపీలో విధుల్లో చేర్చుకోకపోవడం శోచనీయమన్నారు. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రాత్రికిరాత్రి డిల్లీ స్థాయిలో ఒత్తిడి పెంచి ఇక్కడికి పంపారన్నారు. కానీ ఇక్కడున్న ఏపీ ఉద్యోగులను మాత్రం వెనక్కి తీసుకోకుండా తమాషా చేస్తున్నారన్నారు. బాబు వైఖరి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందన్నారు. -
నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ముకరంపుర : ప్రాజెక్టుల పనుల నిర్మాణాలను నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పర్యటన దృష్ట్యా సోమవారం ఉదయం కలెక్టరేట్ సమావేశమందిరంలో కలెక్టర్, ఇరిగేషన్, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లతో ముందస్తుగా సమీక్షించారు. జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో మిడ్‌మానేరుకు ఎడమవైపు గండిపడి బండ్ తెగిపోయిన దృష్ట్యా జరిగిన నష్టం, మిడ్‌మానేరు డ్యాంకింద ముంపు గ్రామాల ప్రజల తరలింపు, జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలపై సమీక్షించారు. డ్యాంనిర్మాణం సకాలంలో ఆయా ఏజెన్సీలు నిర్మాణాలు పూర్తిచేయకపోవడంతో నష్టం జరిగిందని, సకాలంలో ఎందుకు పూర్తిచేయలేదని, ఆ ఏజెన్సీపై తీసుకున్న చర్యలను సీఈ అనిల్‌కుమార్ అడిగి తెలుసుకున్నారు. ముంపుగ్రామాల ప్రజలకు పరిహారం, పునరావాసంవంటి అంశాలపై స్పెషల్ డెప్యూటీ కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆర్అండ్ఆర్ సమస్యలపై సీఈ వివరించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేకాధికారి బీఆర్.మీనా, కలెక్టర్ నీతూ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ శ్రీ దేవసేన పాల్గొన్నారు. -
సేవలను బలోపేతం చేయండి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సాక్షి, సిటీబ్యూరో: రవాణాశాఖలో వివిధ రకాల పౌరసేవల కోసం ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానాన్ని మరింత బలోపేతం చేయాలని, వాహన వినియోగదారులు ఇంటి వద్ద నుంచే పౌర సేవలను పొందే విధంగా విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశించారు. డ్రైవింగ్ లెసైన్స్ రెన్యువల్ కోసం గురువారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి ఆయన వచ్చారు. రవాణాశాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా, హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్ సీఎస్ వెంట ఉండి డ్రైవింగ్ లెసైన్సు ప్రక్రియను పూర్తి చేశారు. రెన్యువల్ కోసం సీఎస్ రాజీవ్‌శర్మ ఫొటో దిగి, డిజిటల్ ప్యాడ్‌పై సంతకం చేశారు. ఆ సమయంలో వినియోగదారుల రద్దీ, పౌరసేవల కోసం నెలకొన్న డిమాండ్ వంటి అంశాలను ఆయన పరిశీలించారు. వీలైనంత వరకు ఆన్లైన్ ద్వారానే అన్ని రకాల రవాణా సేవలు లభించే విధంగా చూడాలన్నారు. కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా ఆన్లైన్ సేవలను గురించి వివరించారు. అలాగే ఆర్టీఏ ఫీజును ఈ సేవ, ఆన్లైన్ కేంద్రాల్లో మాత్రమే చెల్లించే విధంగా ప్రవేశపెట్టిన నగదు రహిత సేవల గురించి సీఎస్‌కు చెప్పారు. త్వరలో ప్రతి పౌరసేవకు ఆన్లైన్లోనే స్లాట్ నమోదు చేసుకొనే పద్ధతిని ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. ఇటీవల ప్రవేశపెట్టిన ఆర్టీఏ-ఎం వాలెట్ యాప్ ద్వారా 7 లక్షల మందికి పైగా తమ డ్రైవింగ్ లెసైన్సులను, ఆర్సీలను డౌన్లోడ్ చేసుకున్నట్లు చెప్పారు. సాక్షి, సిటీబ్యూరో: రవాణాశాఖలో వివిధ రకాల పౌరసేవల కోసం ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానాన్ని మరింత బలోపేతం చేయాలని, వాహన వినియోగదారులు ఇంటి వద్ద నుంచే పౌర సేవలను పొందే విధంగా విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశించారు. డ్రైవింగ్ లెసైన్స్ రెన్యువల్ కోసం గురువారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి ఆయన వచ్చారు. రవాణాశాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా, హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్ సీఎస్ వెంట ఉండి డ్రైవింగ్ లెసైన్సు ప్రక్రియను పూర్తి చేశారు. రెన్యువల్ కోసం సీఎస్ రాజీవ్‌శర్మ ఫొటో దిగి, డిజిటల్ ప్యాడ్‌పై సంతకం చేశారు. ఆ సమయంలో వినియోగదారుల రద్దీ, పౌరసేవల కోసం నెలకొన్న డిమాండ్ వంటి అంశాలను ఆయన పరిశీలించారు. వీలైనంత వరకు ఆన్లైన్ ద్వారానే అన్ని రకాల రవాణా సేవలు లభించే విధంగా చూడాలన్నారు. కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా ఆన్లైన్ సేవలను గురించి వివరించారు. అలాగే ఆర్టీఏ ఫీజును ఈ సేవ, ఆన్లైన్ కేంద్రాల్లో మాత్రమే చెల్లించే విధంగా ప్రవేశపెట్టిన నగదు రహిత సేవల గురించి సీఎస్‌కు చెప్పారు. త్వరలో ప్రతి పౌరసేవకు ఆన్లైన్లోనే స్లాట్ నమోదు చేసుకొనే పద్ధతిని ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. ఇటీవల ప్రవేశపెట్టిన ఆర్టీఏ-ఎం వాలెట్ యాప్ ద్వారా 7 లక్షల మందికి పైగా తమ డ్రైవింగ్ లెసైన్సులను, ఆర్సీలను డౌన్లోడ్ చేసుకున్నట్లు చెప్పారు.